డైమెన్షన్ ఫిలిమ్స్ నిర్మించిన 'పిరానా 3డి' చిత్రం ఈనెల 3న విడుదలైంది. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో 80ధియేటర్లలో విడుదల చేశామని ఎస్.వి.ఆర్. మీడియా అధినేత శోభారాణి తెలిపారు. సోమవారం ఈ చిత్రం విలేకరులకు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో హీరా ఫిలిమ్స్ అధినేత శరత్ జోషి పాల్గొన్నారు. ఇటివలే విడుదలైన ఈచిత్రం సక్సెస్ అయిందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ఐమాక్స్ అధినేత రమేష్ ప్రసాద్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ 'అధునాతన టెక్నాలజీతో ఇటువంటి చిత్రాన్ని ప్రదర్శించాలంటే వనరులున్న ధియేటర్లలోనే చూడాలి. ఈ చిత్రం 3డి, 2డి, ఫార్మేట్ లో విడుదలైందని పేర్కొన్నారు.
శోభారాణి మాట్లాడుతూ 'జాస్' తర్వాత ఆ తరహాలో ఆకట్టుకునే చిత్రమిది. అద్భుతమైన గ్రాఫిక్స్ ఈ చిత్రానికి తోడ్పడ్డాయి. వేలాదిగా వచ్చే పిరానా చేపలు మనిషి పై దాడి చేయడం థ్రిల్ కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ ఇటువంటి చిత్రాలు చూడాలి అని తెలిపారు
|
|
---|
Senin, 06 September 2010
Langganan:
Posting Komentar (Atom)
Tidak ada komentar:
Posting Komentar